Nara Lokesh: అన్నా... అన్నా అని పిలిచేవాడివి... కార్యకర్త ఆత్మహత్యపై నారా లోకేశ్ ఆవేదన

Nara Lokesh emotional after party worker committed suicide
  • శ్రీను అనే కార్యకర్త ఆత్మహత్య
  • కదిలిపోయిన నారా లోకేశ్
  • ఆపద వచ్చినప్పుడు ఈ అన్న గుర్తుకు రాలేదా అంటూ భావోద్వేగం
శ్రీను అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. భావోద్వేగాలతో స్పందించారు. "అన్నా... అన్నా అని పిలిచేవాడివి... ఏ కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి... నీకు ఆపద వస్తే ఈ అన్నకు మెసేజ్ చేయాలని అనిపించలేదా? దిద్దలేని పెద్ద తప్పు చేశావు తమ్ముడూ... ఐ మిస్ యూ" అంటూ లోకేశ్ విచారం వెలిబుచ్చారు. 

"నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని తెలిసి నిన్ను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు! ఓ అన్నగా నీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఎవరికి ఆపద వచ్చినా కష్టసుఖాలను పంచుకుందాం. బతికే ఉందాం... మరో నలుగురిని బతికిద్దాం" అంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు.

Nara Lokesh
Party Worker
Suicide
TDP
Andhra Pradesh

More Telugu News