Naresh Balyan: దోపిడీ కేసులో ఆప్ ఎమ్మెల్యే నరేశ్ అరెస్ట్

AAP MLA Naresh Balyan Arrest In Extortion Case

  • గతేడాది నమోదైన కేసులో నరేశ్ అరెస్ట్
  • విచారణకు పిలిచి అరెస్ట్ చేసిన క్రైం బ్రాంచ్ పోలీసులు
  • గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో బల్యాన్ చర్చలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియో వైరల్
  • నరేశ్ అరెస్ట్ అక్రమమన్న ఆప్

గతేడాది నమోదైన దోపిడీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను నిన్న విచారణకు పిలిచిన ఆర్కేపురం క్రైంబ్రాంచ్ పోలీసులు అనంతరం అరెస్ట్ చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న నరేశ్‌పై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేపీ ప్రశ్నించిన అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం. 

బల్యాన్ అరెస్ట్‌ను ఆప్ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ అక్రమమని పేర్కొంది. బీజేపీ ఆరోపణలను ఖండించిన నరేశ్ ఆ పార్టీ తనపై అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వ్యాపారవేత్తల నుంచి డబ్బులు ఎలా రాబట్టాలనే విషయంపై ప్రస్తుతం విదేశాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో బల్యాన్ చర్చలు జరిపినట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడీ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News