Maoists: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు సహా ఏడుగురు నక్సల్స్ మృతి!

7 Naxals Killed In Encounter In Eturunagaram Telangana

    


ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలైన నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్న సహా పలువురు ఉన్నారు. చల్పాక అటవీ ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు బృందం సంయుక్తంగా కూంబింగ్ నిర్వహస్తుండగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. 

మృతి చెందింది వీరే..
మృతి చెందిన మావోయిస్టులను కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35), ఎగొలాపు మల్లయ్య అలియస్ మధు (43), ముస్సాకి దేవల్ అలియస్ కరుణాకర్ (22), ముస్సాకి జమున (23), జైసింగ్ (25), కిషోర్ (22), కామేశ్ (23)గా గుర్తించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.  వారిని నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

Maoists
Encounter
Eturunagaram
Telangana
Mulugu Dist
  • Loading...

More Telugu News