Gold: స్వల్పంగా పుంజుకున్న బంగారం, వెండి ధరలు

gold silver rates november 30th 2024 hyderabad and delhi
  • పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధరపై రూ. 630 పెరుగుదల
  •  హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 78,120గా నమోదు
  • కిలోపై రూ. 2,200 పెరిగి రూ. 1,00,100కు చేరుకున్న వెండి
కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు చవిచూస్తున్న బంగారం, వెండి ధరలు నిన్న స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర పది గ్రాములకు రూ. 630 పెరిగి రూ.78,120కి చేరుకుంది. అదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరపై రూ.780 పెరిగి రూ. 78,120కి, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.71,610కి చేరింది. 

మరో వైపు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 78,270కి చేరుకోగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,770గా నమోదైంది. వెండి కూడా కిలోపై రూ. 2,200 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కిలో వెండి రూ. 1,00,100 ఉండగా.. ఢిల్లీ, ముంబైలలో రూ. 91,600గా ఉంది. 
Gold
silver
Business News

More Telugu News