Kakani Govardhan Reddy: కూటమి హామీలను రింగ్ టోన్ గా పెట్టుకున్న వైసీపీ మాజీ మంత్రి... వీడియో వైరల్

Kakani set alliance poll assuarance as his phone ringtone
  • ఎన్నికల వేళ తల్లికి వందనం హామీ ఇచ్చిన కూటమి
  • ఇప్పటివరకు హామీలు నెరవేర్చలేదంటూ వైసీపీ విమర్శనాస్త్రాలు
  • కాకాణి ప్రెస్ మీట్ లో విచిత్రమైన రింగ్ టోన్ తో మోగిన ఫోన్
ఏపీలో ఎన్నికల వేళ కూటమి నేతలు తల్లికి వందనం పేరిట చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని ప్రచారం చేశారు. అయితే, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏకంగా, కూటమి ప్రభుత్వ హామీలను తన ఫోన్ రింగ్ టోన్ గా పెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

కాకాణి నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఆయన ఫోన్ మోగింది. "నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీక్కూడా 15 వేలు... కావాలంటే రాసిపెట్టుకోండి" అంటూ రింగ్ టోన్ వినిపించడంతో ప్రెస్ మీట్ కు వచ్చిన అందరూ ఆశ్చర్యపోయారు. ఓ టీడీపీ నేత ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆడియో క్లిప్పింగ్ ను కాకాణి తన ఫోన్ కు రింగ్ టోన్ గా సెట్ చేసుకున్నారు. 

దీనిపై కాకాణి స్పందిస్తూ... చంద్రబాబునాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలు గుర్తుండాలి కదా అని ఈ రింగ్ టోన్ పెట్టుకున్నానని, అందుకే ఫోన్ మోగగానే ఆ రింగ్ టోన్ వినిపించిందని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Kakani Govardhan Reddy
Ringtone
Poll Assurance
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News