Hemasundar: ఎన్టీఆర్ అలా చేస్తారని ఊహించలేదు: నటుడు హేమసుందర్!

Hema Sunadar Interview

  • ఏఎన్నార్ వలన ఇండస్ట్రీకి వచ్చానన్న హేమసుందర్ 
  • 'విచిత్రబంధం'తో కెరియర్ మొదలైందని వెల్లడి 
  • రజనీకాంత్ రాకెట్ లా దూసుకెళ్లాడని వ్యాఖ్య 
  • ఇంకా నటించాలనే కోరిక ఉందని వివరణ   



హేమసుందర్ .. సీనియర్ నటుడు. వందల సినిమాలలో కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన నటించారు. ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను ఏఎన్నార్ ను చూసే ఇండస్ట్రీకి వచ్చాను. నేరుగా ఆయననే అవకాశాలు అడిగాను. అలా ఆయన సినిమా 'విచిత్రబంధం'తోనే నా కెరియర్ మొదలైంది" అని అన్నారు. 

" నేను ఎన్టీఆర్ గారికి తాత పాత్రలో నటించాను. అప్పటికే ఆయన గొప్పనటుడు. నేను వేసిన తాత పాత్ర .. ఎస్వీఆర్ - గుమ్మడివంటి వారు వేయవలసిన పాత్ర. కానీ ఆ పాత్ర నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఒక సీన్లో మనవడిగా నా పాదాలపై పడమని దర్శకుడు చెప్పకపోయినా రామారావుగారు హఠాత్తుగా అలా చేశారు. అది ఊహించని నేను బిత్తరపోయాను. పాత్ర గురించి తప్ప మరిదేని గురించి ఆలోచన చేయని మహానుభావుడు ఆయన" అని చెప్పారు.

" అప్పట్లో రజనీకాంత్ తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఇద్దరం బాలచందర్ స్కూల్ నుంచి రావడం కూడా ఒక కారణం. ఆయన అలా ఒక స్టార్ గా అంత ఫాస్టుగా దూసుకెళతాడని నేను కూడా ఊహించలేదు. నటుడిగా నాకు దక్కిన గౌరవం పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు ఇప్పుడు 83 ఏళ్లు. నేను ఒక టాబ్లెట్ వేసుకోక ఎన్నేళ్లు అయిందో. ఆరోగ్యంగా ఉండటం నా అదృష్టం .. అవకాశాలు ఇస్తే నటించడానికి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను" అని అన్నారు.

Hemasundar
Ntr
Anr
Rajanikanth
  • Loading...

More Telugu News