Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు... ఆహ్వానించిన ఈసీ

EC invites congress to review

  • డిసెంబర్ 3న వచ్చి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్న ఈసీ
  • ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • కాంగ్రెస్ ప్రతినిధుల చట్టపరమైన ఆందోళనలను పరిశీలిస్తామన్న ఈసీ

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏవైనా అనుమానాలు ఉంటే డిసెంబర్ 3న వచ్చి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని ఆహ్వానించింది. ప్రతి ఎన్నిక కూడా పారదర్శకంగా జరుగుతోందని తెలిపింది. వారి చట్టపరమైన ఆందోళనలను తాము పరిశీలిస్తామని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇస్తామని తెలిపింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలను తెలియజేస్తామని ఆ లేఖలో పేర్కొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఈసీ నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ప్రతిపక్ష కూటమి కేవలం 46 సీట్లకే పరిమితమైంది.

Maharashtra
Election Commission
Congress
BJP
  • Loading...

More Telugu News