Gone Prakash Rao: జగన్ అమెరికాకు వెళ్లాల్సిందే.. కోర్టుకు హాజరుకావాల్సిందే: గోనె ప్రకాశ్ రావు

Jagan has to go to America says Gone Prakash Rao

  • అదానీతో పాటు జగన్ పై విచారణ జరిపించాలన్న గోనె
  • తన పేరు లేదని జగన్ చెప్పినా ఉపయోగం లేదని వ్యాఖ్య
  • చేసిన తప్పును జగన్ ఒప్పుకోవాల్సిందేనన్న గోనె

ప్రధాని మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి అదానీతో పాటు గత ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా సీబీఐ లేదా జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని లేఖలో కోరారు. 

అదానీ సంస్థతో జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని గోనె ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. ఈ అవినీతి అక్రమాలపై విచారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ అక్రమ ఒప్పందం వల్ల ఏపీ ప్రజలపై రూ. 1.50 లక్షల కోట్ల భారం పడుతుందని అన్నారు. 

అమెరికాలో నమోదైన కేసులో తన పేరు లేదని జగన్ అంటున్నారని... జగన్ అమెరికాకు వెళ్లాల్సిందేనని, కోర్టుకు హాజరు కావాల్సిందేనని గోనె చెప్పారు. సీబీఐని కూడా అడ్డుకున్న చరిత్ర జగన్ దని విమర్శించారు. తన పేరు లేదని జగన్ చెప్పినా ఉపయోగం లేదని అన్నారు. జగన్ కు రూ. 1,750 కోట్లు వచ్చాయని... చేసిన తప్పును ఒప్పుకోవాల్సిందేనని చెప్పారు. 

అదానీ పేరు మీద గంగవరం పోర్టు, ఇతర సంస్థలు ఉన్నాయని... వాటిని ఏపీ ప్రభుత్వం రద్దు చేయాలని గోనె ప్రకాశ్ రావు అన్నారు. దేశ పరువును అదానీ తీశారని, రాష్ట్ర పరువును జగన్ తీశారని చెప్పారు.

  • Loading...

More Telugu News