Kim Jong Un: శత్రు దేశాలపై దాడి చేసే హక్కు రష్యాకు ఉంది: కిమ్ జోంగ్ ఉన్

Russia has right to attack enemy countries says Kim Jong Un
  • అమెరికా దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్షిపణులు అందించాయన్న కిమ్
  • రష్యాపై దాడికి ప్రేరేపించాయని మండిపాటు
  • రష్యాతో అన్ని రంగాల్లోనూ బంధాలను విస్తరించుకుంటామని వెల్లడి
ఆత్మరక్షణ కోసం శత్రు దేశాలపై దాడి చేసే హక్కు రష్యాకు ఉందని ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. అమెరికా దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్షిపణులను అందించి... రష్యాపై దాడి చేసేందుకు ప్రేరేపించాయని కిమ్ విమర్శించారు. శత్రువులపై రష్యా కూడా ప్రతీకార చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. శత్రువులపై దాడి చేసే హక్కు రష్యాకు ఉందని అన్నారు. రష్యాతో సైనిక సంబంధాలతో పాటు అన్ని రంగాల్లో బంధాలను విస్తరించుకుంటామని చెప్పారు.
 
కిమ్ జోంగ్ ఉన్ తో రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ సమావేశమయ్యారు. బెలౌసోవ్ బృందానికి ఉత్తరకొరియా రక్షణ మంత్రిత్వ శాఖ విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేసినట్టు కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. 

మరోవైపు, ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు కిమ్ జోంగ్ ఉన్ సైనిక సాయాన్ని అందిస్తున్నారు. 10 వేలకు పైగా సైనికులను రష్యాకు పంపించారు. రష్యాకు ఉత్తరకొరియా సైనికులను పంపడాన్ని అమెరికా తప్పుపట్టింది. ఈ క్రమంలో రష్యా-ఉత్తరకొరియా రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కిమ్ సైనిక సాయానికి బదులుగా ఉత్తరకొరియాకు యాంటీ మిస్సైల్ సిస్టమ్ ను రష్యా పంపించింది.
Kim Jong Un
North Korea
Russia

More Telugu News