Varanasi Railway Station: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 200 వాహనాలు!

Massive Fire Breaks Out At Varanasi Railway Station 200 Vehicles Destroyed

  • వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ప్ర‌మాదం
  • షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో వెల్ల‌డి
  • రెండు గంటల పాటు క‌ష్ట‌ప‌డి మంటలను అదుపులోకి తీసుకువ‌చ్చిన అగ్నిమాప‌క సిబ్బంది

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. దాంతో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. వెంట‌నే సంఘటనా స్థలానికి చేరుకున్న‌ అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకువ‌చ్చారు. 

గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), స్థానిక పోలీసు బృందంతో పాటు 12 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు మంటలను ఆర్పేందుకు ప్ర‌మాద‌ స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయప‌డ‌లేద‌ని సమాచారం. 

కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని అధికారులు చెప్పారు. రెండు గంటల పాటు క‌ష్ట‌ప‌డి మంటలను అదుపులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News