Telangana: పులివెందులలో వైసీపీ నేతల ఆధీనంలోని కార్లను విడిపించిన తెలంగాణ పోలీసులు!

Telangana Police found Sangareddy man cars in Pulivendula

  • సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్ కార్లను అద్దెకు తీసుకెళ్లిన వైసీపీ నేతలు
  • కార్లు అడిగితే కొట్టారని మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసిన సతీశ్ కుమార్
  • పులివెందుల పోలీసుల సాయంతో కార్లను గుర్తించిన తెలంగాణ పోలీసులు
  • సతీశ్ కుమార్‌కు కార్లను అప్పగించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా పులివెందులలో... తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్ కార్లను పోలీసులు విడిపించారు. ఈ కార్లు పులివెందులలో అక్కడి వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నాయి. తెలంగాణ పోలీసులు వాటిని విడిపించారు. ఈ కార్లను దాదాపు మూడేళ్లుగా వైసీపీ నేతలు వినియోగిస్తున్నారు.

పులివెందుల మెడికల్ కాలేజీ కోసమని చెప్పి సంగారెడ్డికి చెందిన సతీశ్ కుమార్‌కు చెందిన ఆరు కార్లను అక్కడి వైసీపీ నేతలు రెంటల్ కాంట్రాక్ట్‌పై తీసుకెళ్లారు.

ఆ కార్లను తీసుకెళ్లిన వైసీపీ నేతల ఆచూకీ సతీష్ కుమార్‌కు లభించలేదు. జీపీఎస్ ట్రాక్ చేసి చూడగా కార్లు వేంపల్లెలో ఉన్నట్లుగా గుర్తించాడు. అక్కడకు వెళ్ళి తన కార్లను ఇచ్చేయాలని తాను అడగగా... ఇడుపులపాయలో తనను బంధించి కొట్టారని సతీశ్ కుమార్ ఆరోపించాడు. ఈ మేరకు 2021లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేసులో కదలిక వచ్చింది. కడప పోలీసుల సాయంతో తెలంగాణ పోలీసులు నాలుగు రోజుల పాటు పులివెందుల, వేంపల్లెలో తిరిగారు. కార్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని సతీష్ కుమార్‌కు అప్పగించారు.

  • Loading...

More Telugu News