Glenn Phillips: కళ్లు చెదిరే డైవ్ చేస్తూ క్యాచ్ పట్టిన గ్లెన్ ఫిలిప్స్... వీడియో ఇదిగో!

Glenn Philips Super Catch

  • సింగిల్ హ్యాండ్ తో బంతిని ఒడిసిపట్టిన వైనం
  • ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లో ఫిలిప్స్ అద్భుత ఫీల్డింగ్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. టిమ్ సౌథీ వేసిన బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఓలీ పోప్ బ్యాక్ వర్డ్ పాయింట్ వైపు బాదగా... అక్కడ ఫిల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ పక్షిలా ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. 

సహచర ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఈ విన్యాసం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై గ్లెన్ ఫిలిప్స్ ను అభినందిస్తూ చప్పట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఇన్నింగ్స్ 52వ ఓవర్ లో ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్ తో ఓలీ పోప్ 77 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. కాగా, కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో గ్లెన్ ఫిలిప్స్ అందుకున్న ఈ క్యాచ్ ఆయన కెరీర్ లోనే స్పెషల్ గా నిలవనుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Glenn Phillips
Viral Videos
Team England
Team New Zealand
Christchurch
Test Match

More Telugu News