Naga Chaitanya: నాగచైతన్య, శోభితల వివాహ వేడుకలు.. వైరల్ గా మారిన హల్దీ ఫొటో

Naga Chaitanya Shobita Haldi Celebrations Photo Viral
  • అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిన వేడుక
  • డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వివాహం
  • సింపుల్ గా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల నిర్ణయం
అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగచైతన్య, శోభితల వివాహం వచ్చే నెల 4న జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా హల్దీ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాబోయే వధూవరులకు బంధువులు మంగళ స్నానాలు చేయించారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభితల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. ఎలాంటి ఆర్భాటాలకు తావివ్వకుండా సింపుల్ గా వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపారు. 

అన్నపూర్ణ స్టూడియో తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పారు. స్టూడియోలోని తన తాతగారి విగ్రహం ముందు పెళ్లి చేసుకుంటున్నట్లు వివరించారు. ఆయన ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. శోభిత తనను బాగా అర్థం చేసుకుందని, ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని వివరించారు. శోభితతో తాను బాగా కనెక్ట్ అయ్యానని, తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని ఆమె భర్తీ చేస్తుందని చెప్పుకొచ్చారు. వివాహానికి ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయంతో పాటు ఇతరత్రా పనులకు సంబంధించి తాను, శోభిత కలిసి నిర్ణయిస్తున్నామని నాగచైతన్య వివరించారు.
Naga Chaitanya
Sobhita Dhulipala
Marriage
Akkineni
Annapurna Studio

More Telugu News