Nagarjuna: ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున సందడి

Akkineni Nagarjuna in RTA office

  • ఇటీవల ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసిన నాగార్జున
  • రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన నాగ్
  • పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న అభిమానులు

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఈరోజు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవలే ఆయన ఒక హైఎండ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. అధికారుల సమక్షంలో ఫొటో దిగి రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేశారు. మరోవైపు, నాగార్జున వచ్చారనే విషయం తెలుసుకుని అక్కడకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. నాగార్జునతో సెల్ఫీ దిగేందుకు వారు పోటీ పడ్డారు.

Nagarjuna
Tollywood
  • Loading...

More Telugu News