Raghunandan Rao: కేటీఆర్ పై రఘునందన్ తీవ్ర వ్యాఖ్యలు

BJP MP Raghunandan Rao Fires On KTR

  • కాంగ్రెస్ తో మేం కలిసిపోయి ఉంటే జైలులో ఉండేవాడివన్న బీజేపీ నేత
  • పదేళ్లపాటు అన్ని శాఖల్లో వేలు పెట్టి పలు వ్యవస్థలను చిన్నాభిన్నం చేశాడని విమర్శ
  • అధికారంతో పాటు కేటీఆర్ మెదడు కూడా పోయినట్టుందని ఎద్దేవా

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. తామే కనుక కాంగ్రెస్ తో కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఇలా ట్వీట్లు పెడుతూ ఉండేవాడివి కాదు, చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటూ ఉండేవాడివని అన్నారు. కేటీఆర్ పనికిమాలిన స్టేట్ మెంట్లు చూస్తుంటే అధికారంతో పాటు ఆయన తన మెదడును కూడా కోల్పోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. 

అధికారంలో ఉన్న పదేళ్లలో అన్ని శాఖల్లో వేలుపెట్టి తెలంగాణ ఆర్థిక, విద్య, వైద్య వ్యవస్థలను కేటీఆర్ చిన్నాభిన్నం చేశాడని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. రాజకీయాలు ఎలా చేయాలో కేటీఆర్ లాంటి వారి దగ్గర నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యం తమకు పట్టలేదన్నారు. రాజకీయం ఎలా చేయాలో, ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలిసి ఉంటే చేతిలో ఉన్న అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. కేటీఆర్ ను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు కేసీఆర్ ప్రస్తుతం ప్రజలకు ముఖం చూపించలేక ఫాంహౌస్ కే పరిమితమయ్యాడని రఘునందన్ రావు చెప్పారు.

Raghunandan Rao
KTR
BJP
Congress
BRS
KTR Tweet

More Telugu News