Revanth Reddy: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం: రేవంత్ రెడ్డి వార్నింగ్

Revanth Reddy on food poisoning in residential schools

  • గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై రేవంత్ ఆగ్రహం
  • పాఠశాలలు, గురుకులాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశం
  • పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలన్న రేవంత్

గురుకుల పాఠశాలల వసతి గృహాల్లో తరచుగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకుంటుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, గురుకులాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని అన్నారు.

విద్యార్థులకు పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలని సీఎం చెప్పారు. పౌష్టికాహారాన్ని అందించేందుకు డైట్ ఛార్జీలను కూడా పెంచామని తెలిపారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరించారు. పదేపదే హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. 

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ అన్నారు. బాధ్యులపై జిల్లా కలెక్టర్లు వేటు వేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News