Priyanka Gandhi: కేరళ సంప్రదాయ చీరను ధరించి ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం.. వీడియో ఇదిగో

Priyanka Gandhi takes oath as MP

  • వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకాగాంధీ ఘన విజయం
  • ప్రియాంకతో ప్రమాణస్వీకారం చేయించిన స్పీకర్ ఓం బిర్లా
  • ఓనం చీరను ధరించి, రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం

కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంకాగాంధీ ప్రమణస్వీకారం చేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం చేశారు. కేరళ సంప్రదాయ ఓనం చీరను ధరించి ఆమె పార్లమెంటుకు వచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ ఆమెను పార్లమెంటుకు తోడ్కుని వచ్చారు.  

ఇటీవల వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ప్రియాంక ఘన విజయం సాధించారు. 4.10 లక్షల భారీ మెజార్టీతో ఆమె జయకేతనం ఎగురవేశారు. ఆమెకు మొత్తం 6.22 లక్షల ఓట్లు పడ్డాయి. 

నాందేడ్ ఉపఎన్నికలో గెలుపొందిన కాంగ్రెస్ నేత రవీంద్ర వసంతరావ్ చవాన్ కూడా ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారాల కార్యక్రమం ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను మధ్యాహ్నం 12 వరకు స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

Priyanka Gandhi
Congress

More Telugu News