Chandrababu: రాత్రి నారావారిపల్లెలో బస చేసిన చంద్రబాబు

Chandrababu in Naravaripalle

  • నేడు నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియలు
  • రాత్రి నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు, నారా లోకేశ్
  • ఈ నెల 16న కన్నుమూసిన రామ్మూర్తినాయుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో నిన్న రాత్రి బస చేశారు. ఆయన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియలు ఈరోజు నారావారిపల్లెలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ రాత్రి 7.30 గంటలకు నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుకు కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు, నారా లోకేశ్ సాయంత్రం 6.35 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. మరోవైపు, ఈ రాత్రికి చంద్రబాబు నారావారిపల్లోనే బస చేస్తారా? లేక తిరుగుపయనమవుతారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఈ నెల 16వ తేదీన రామ్మూర్తినాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన... హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆ మరుసటి రోజు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అంత్య్రక్రియల కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Chandrababu
Nara Lokesh
Telugudesam
Nara Ramamurthy Naidu
Naravaripalle
  • Loading...

More Telugu News