Pushpa 2: మలయాళ ఫ్యాన్స్ కి నేనిచ్చే గిఫ్ట్ ఇదే: 'పుష్ప 2' ఈవెంటులో బన్నీ

Pushpa 2  Kerala Event Upadate

  • నిన్న రాత్రి 'కొచ్చి'లో జరిగిన 'పుష్ప 2' ఈవెంట్
  • అభిమానుల నుంచి లభించిన భారీ రెస్పాన్స్ 
  • వేదికపై హుషారుగా సందడి చేసిన అల్లు అర్జున్
  • ఆయనతో కలిసి మెరిసిన రష్మిక        


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2' రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మలయాళ వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు, కేరళలోని 'కొచ్చి' వేదికగా మారింది. నిన్న జరిగిన ఈ వేడుకలో అల్లు అర్జున్ తనదైన స్టైల్లో సందడి చేశాడు.

నిన్న ఎయిర్  పోర్టు నుంచి ఈవెంట్ జరిగే ఏరియా వరకూ అల్లు అర్జున్ కి స్వాగతం చెబుతూ పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అక్కడి వాతావరణం .. వాళ్లు చూపిస్తున్న అభిమానం ఆయనలో మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టినట్టుగా కనిపించింది. దాంతో ఆయన మరింత ఉల్లాసంగా .. ఉత్సాహంగా కనిపించాడు. 

స్టేజ్ పై బన్నీ మాట్లాడుతూ .. 'ఆర్య' సినిమా నుంచి తనని ఆదరిస్తున్న మలయాళ ప్రేక్షకులకు తాను ఎంతో రుణపడి ఉంటానని అన్నాడు. ఆ సినిమా నుంచే మలయాళంలో తన మార్కెట్ మొదలైందని చెప్పాడు. తన సినిమాలో ఫహాద్ ఫాజిల్ నటించడం తనకి చాలా సంతోషాన్ని కలిగించిన విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

ఈ సినిమాలోని ఒక పాట మలయాళ లిరిక్స్ తో మొదలవుతుందనీ, ఏ భాషలో 'పుష్ప 2' విడుదలైనా, ఆ పాట స్టార్టింగ్ లిరిక్స్ మలయాళంలోనే ఉంటాయని అన్నాడు. అదే మలయాళ ఫ్యాన్స్ కి తాను ఇచ్చే గిఫ్ట్" అంటూ వాళ్లని హుషారెత్తించాడు. ఇక రష్మిక మరింత అందంగా కనిపిస్తూ ఈవెంటుకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఈవెంట్ అంతా నవ్వుతూ కనిపించడమే కాకుండా, స్టేజ్ పై స్టెప్పులతోను అలరించింది.

Pushpa 2
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
  • Loading...

More Telugu News