Mid Day Meal: మ‌ధ్యాహ్నం భోజ‌నం ధ‌ర‌ల పెంపు.. కేంద్రం కీల‌క ఆదేశాలు

Central Government revises Mid day Meal Material Cost

  • ప్ర‌స్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చ‌దివే ఒక్కో విద్యార్థికి రూ. 5.45 చొప్పున ఖర్చు
  • దానిని  రూ.6.19కి పెంచిన కేంద్రం
  • ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో చ‌దివే ఒక్కో విద్యార్థికి రోజుకు చేస్తున్న రూ.8.17 వ్య‌యాన్ని రూ.9.29కి పెంపు
  • పెంచిన ధ‌ర‌లు డిసెంబరు 1 నుంచే అమలు

మధ్యాహ్న భోజన ప‌థ‌కం ధరల‌ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చ‌దివే ఒక్కో విద్యార్థికి రూ. 5.45 చొప్పున ఖర్చు చేస్తుండ‌గా దానిని రూ. 6.19కి పెంచింది. అదే విధంగా ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో చ‌దివే ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 8.17 చొప్పున చెల్లిస్తుండ‌గా దానిని రూ. 9.29కి పెంచింది. ఈ ఖ‌ర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరిస్తాయి.

ఈ మేర‌కు ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తూ విద్యా మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. పెంచిన ధ‌ర‌ల‌ను డిసెంబరు 1 నుంచి అమలు చేయాలని అధికారులను కోరింది.

Mid Day Meal
Central Government
  • Loading...

More Telugu News