HYDRA: సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు నిర్మాణాలు వద్దు: హైడ్రా కమిషనర్

HYDRA Commissioner Ranganath inspects Edulakunta pond

  • మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
  • చెరువు శిఖాన్ని పూడ్చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన రంగనాథ్
  • చెరువులోకి నీరు వచ్చే నాలాను దారి మళ్లించినట్లు గుర్తించిన కమిషనర్

ఈదులకుంటను సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువును ఆయన పరిశీలించారు. ఖానామెట్ గ్రామంలో 6.5 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు శిఖాన్ని పూడ్చేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు. చెరువులోకి నీరు వచ్చే నాలాను బిల్డర్లు దారి మళ్లించినట్లు గుర్తించారు.

తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అనుమతులు తీసుకున్నట్లు హైడ్రా కమిషనర్ గుర్తించారు. అక్రమంగా తీసుకున్న అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టినట్లు కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. ఈ క్రమంలో అక్కడ సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News