Pawan Kalyan: మోదీతో అరగంటసేపు పవన్ భేటీ.. అనంతరం పవన్ ను కలిసిన పురందేశ్వరి

Pawan meets Modi

  • పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో భేటీ
  • ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ
  • డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి మోదీని కలిసిన పవన్

ప్రధాని మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటి ముగిసింది. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో వీరి సమావేశం దాదాపు అరగంట సేపు కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో పవన్ చర్చించినట్టు సమాచారం. డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి మోదీని పవన్ కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మోదీతో సమావేశం ముగిసిన తర్వాత... పవన్ తో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. అనంతరం పవన్ ను టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు.

Pawan Kalyan
Janasena
Narendra Modi
BJP
Daggubati Purandeswari
  • Loading...

More Telugu News