Rashmika Mandanna: ఐదేళ్లు 'పుష్ప' సెట్ లోనే గడిచిపోయాయి: రష్మిక మందన్న భావోద్వేగం

Rashmika Mandanna pens emotional post

  • 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక
  • చివరి రోజున రోజంతా షూటింగ్ జరిగిందని వెల్లడి
  • అల్లు అర్జున్ తో పాటు మొత్తం టీమ్ తో ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడిందన్న రష్మిక

'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది. "ఈ నెల 24వ తేదీన రోజు మొత్తం షూటింగ్ చేసుకుని చెన్నైలో ఈవెంట్ కు హాజరయ్యాం. అదే రోజు రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నాం. ఇంటికి వెళ్లి 4 నుంచి 5 గంటలు పడుకున్నా. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి పుష్ప చిత్రంలో నా చివరి రోజు షూటింగ్ కు వెళ్లాను. ఆరోజు ఒక అద్భుతమైన సాంగ్ షూట్ చేశారు. ఈ పాటకు సంబంధించిన వివరాలు మీకు త్వరలోనే తెలుస్తాయి. చివరి రోజంతా షూటింగ్ జరిగింది.

పుష్ప సినిమాకు సంబంధించి నాకు అదే చివరి రోజు అని తెలిసినప్పటికీ... నాకు అలా అనిపించలేదు. ఎందుకనేది ఎలా చెప్పాలో తెలియడం లేదు. నా ఏడెనిమిదేళ్ల కెరీర్లో గత 5 ఏళ్లు దాదాపు ఈ సినిమా సెట్ లోనే గడిచిపోయాయి. ఇంకా పని మిగిలే ఉంది. పార్ట్-3 కూడా ఉంది. 

ఏదో అర్థం కాని దుఃఖం. అన్ని భావోద్వేగాలు కలిసి వచ్చాయి. ఎంతో అలసిపోయాను. ఇదే సమయంలో ఎంతో గర్వంగా కూడా ఉంది. గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం, మనకు తెలియకుండానే వారితో అనుబంధం ఏర్పడటం క్రేజీగా ఉంది.

అల్లు అర్జున్, సుకుమార్ తో పాటు మొత్తం టీమ్ తో ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడింది. పుష్ప సెట్ నాకు హోమ్ గ్రౌండ్ అయింది. 2024 నవంబర్ 25వ తేదీ నాకు ఎంతో కష్టమైన రోజు. అయితే అది విలువైన రోజుగా ఉంటుందని ఆశిస్తున్నా" అని రష్మిక భావోద్వేగానికి గురయింది.

Rashmika Mandanna
Allu Arjun
Pushpa
Tollywood
  • Loading...

More Telugu News