Joe Biden: హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సమ్మతి

biden announces ceasefire agreement between israel and hezbollah

  • ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మద్య కాల్పుల విరమణ
  • ఫలించిన అమెరికా దౌత్యం
  • కాల్పుల విరమణపై ఎక్స్ వేదికగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ‘శుభవార్త. నేను ఇజ్రాయెల్ – లెబనాన్‌ల ప్రధానులతో మాట్లాడాను. టెల్‌అవీవ్ – హిజ్బుల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని ఆమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం’ అని బైడెన్ పేర్కొన్నారు. 

ఆమెరికా దౌత్యంతో లెబనాన్‌లో యుద్ధానికి ముగించడానికి మార్గం సుగమమయింది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయాయి. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్‌లో సుమారు 3,800 మంది మరణించగా, 16వేల మందికిపైగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ నుంచి వైదొలగవలసి ఉండగా, లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది. 

ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు ఆమెరికా, టర్కీ, ఈజిప్ట్, ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామన బైడెన్ వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు. లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాలి ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. మరో వైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యూహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ పైనే ఆధారపడి ఉందన్నారు. తాము ఒప్పందాన్ని అమలు చేస్తామని, కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News