Pawan Kalyan: నేడు ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ

deputy cm pawan kalyan will meet pm modi today

  • ఢిల్లీలో బిజీబీజీగా సాగుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన
  • ఈవేళ ప్రధాని మోదీకి జల్ జీవన్ పథకం కొనసాగింపుపై విజ్ఞప్తి చేసే చాన్స్
  • ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా గడుస్తోంది. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈరోజు (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించనున్నారు. జల్ జీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధుల కోసం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేయనున్నారు. 

గత ప్రభుత్వ హయాంలో ఈ స్కీమ్‌కు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఏపీలో స్కీమ్ నిలిచిపోయింది. దీంతో ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయిలను ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోదీని పవన్ కోరనున్నారు.  
 
ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్, అశ్వినీ వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, సీఆర్ పాటిల్, రాజీవ్ రంజన్ సింగ్‌లతో వరుస సమావేశాలు నిర్వహించి, ఆయ శాఖలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి అంశాలపై చర్చించి, వినతి పత్రాలను అందించారు. 

అలాగే వారాహి డిక్లరేషన్ బుక్స్‌ను కేంద్రమంత్రులకు అందించారు. మంగళవారం రాత్రి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విందుకు ఆహ్వానించారు. బుధవారం ఢిల్లీలో పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఉప రాష్ట్రపతిని పవన్ కల్యాణ్ ఆహ్వానించారు.  
 

  • Loading...

More Telugu News