ICC: ఈ నెల 29న ఐసీసీ సమావేశం... టీమిండియాపై నిర్ణయం తీసుకునే అవకాశం!

ICC will meet on Nov 29

  • పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ
  • షెడ్యూల్, వేదికల ఖరారుపై చర్చించనున్న ఐసీసీ
  • భారత్ పై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి

మరి కొన్ని నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో, నవంబరు 29న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశం కానుంది. వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్, వేదికల ఖరారు గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికగా పాకిస్థాన్ ను గతంలోనే ఎంపిక చేశారు. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 29న జరిగే సమావేశంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ICC
Champions Trophy 2025
India
Pakistan
  • Loading...

More Telugu News