Deep Technology Building: హైటెక్ సిటీ తరహాలో... అమరావతిలో డీప్ టెక్నాలజీ బిల్డింగ్

AP Govt set to buld Deep Technology Building in Amaravati
  • నూతన ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • డీప్ టెక్నాలజీ బిల్డింగ్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం
  • భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీదేనని వెల్లడి 
  • సమీక్షకు హాజరైన ఐటీ మంత్రి నారా లోకేశ్
హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీ ఎలా వన్నె తెచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే, ఏపీ రాజధాని అమరావతిలోనూ హైటెక్ సిటీ తరహాలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నూతన ఐటీ పాలసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీప్ టెక్నాలజీ బిల్డింగ్ అంశం ప్రస్తావనకు వచ్చింది. 

గతంలో హైదరాబాదులో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హైటెక్ సిటీ తీసుకువచ్చామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని, డీప్ టెక్నాలజీతో కలిగే అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

ఈ దిశగా అమరావతిలో డీప్ టెక్నాలజీ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాగా, ఈ సమీక్ష సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.
Deep Technology Building
Amaravati
HiTech City
Chandrababu
Nara Lokesh
Hyderabad
TDP-JanaSena-BJP Alliance

More Telugu News