TS High Court: పట్నం నరేందర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

HC postponed hearings on Patnam Narendar Reddy petition

  • బొంరాస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడి
  • ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశమున్నందున బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి
  • పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం లేదన్న ప్రభుత్వ న్యాయవాది
  • తదుపరి విచారణను వాయిదా వేసిన హైకోర్టు

లగచర్ల ఘటనలో అరెస్టైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గత నెల బొంరాస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశముందని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.

ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. బొంరాస్‌పేట పోలీసులు నమోదు చేసిన కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదని వెల్లడించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.

TS High Court
Patnam Narendar Reddy
BRS
  • Loading...

More Telugu News