Lagacharla: లగచర్ల ఘటనలో అరెస్టైన అమాయకులను విడిపించాలని రేవంత్ రెడ్డిని కోరుతా: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

SC and ST commisstion chairman meets Lagacharla victims

  • సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలిసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
  • ఈ కేసులోని అమాయకులను విడుదల చేయాలని విజ్ఞప్తి
  • ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళతామని వెల్లడి

లగచర్ల ఘటనలో అరెస్ట్ చేసిన అమాయకులను విడిపించాలని తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. ఈరోజు ఆయన లగచర్లలో కలెక్టర్, అధికారుల మీద దాడి ఘటనలో అరెస్టైన 24 మందితో భేటీ అయ్యారు. సంగారెడ్డి జైల్లో ఉన్న వారిని కలిసి మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లగచర్ల కేసుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తామన్నారు. ఈ కేసులో అమాయకులను విడుదల చేయాలని కోరారు. ఇప్పటికీ ఆ గ్రామస్థులు భయంతో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కలెక్టర్ మీద దాడి ఘటనలో అమాయకులను జైల్లో వేశారన్నారు. ఈ ఘటనలో పోలీసులు చాలా కర్కశంగా వ్యవహరించారని మండిపడ్డారు. కలెక్టర్ మీద దాడిని కూడా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళతామన్నారు.

Lagacharla
Vikarabad District
Revanth Reddy
BJP
  • Loading...

More Telugu News