Samantha: నాగచైతన్యపై సమంత కామెంట్

Samantha comments on Naga Chaitanya

  • 'సిటాడెల్' ప్రమోషన్లలో సమంతకు వరుణ్ ధావన్ ప్రశ్నలు
  • మీరు ఎవరికైనా ఇచ్చిన గిఫ్ట్ వేస్ట్ అయిందని అనిపించిందా? అని వరుణ్ ప్రశ్న
  • నా ఎక్స్ కు ఇచ్చిన గిఫ్ట్ అంటూ సమంత సమాధానం

సినీనటులు సమంత, నాగచైతన్యలు విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వారు ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఎలాంటి కామెంట్స్ చేసుకోలేదు. సినీ నటి శోభితను నాగచైతన్య కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. 

మరోవైపు, సమంత నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ ఇటీవల విడుదలయింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలిచ్చింది. ఖరీదైన గిఫ్ట్ ను ఎవరికైనా ఇచ్చిన తర్వాత... ఆ గిఫ్ట్ వేస్ట్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా? అని వరుణ్ అడిగాడు. దీనికి సమాధానంగా... 'నా ఎక్స్ (మాజీ భర్త)కు ఇచ్చిన బహుమతి' అని సమంత సమాధానమిచ్చింది.

Samantha
Naga Chaitanya
Tollywood
  • Loading...

More Telugu News