PV Ramesh: జగన్ హయాంలో విద్యుత్ రంగం నాశనమయింది.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: రిటైర్ట్ ఐఏఎస్ అధికారి రమేశ్

Retd IAS PV Ramesh on Jagan power purchase deals

  • 2019లో 23 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలను రద్దు చేశారన్న రమేశ్
  • 2023లో ఒక సంస్థకు చెందిన 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారని వెల్లడి
  • ఈ ఒప్పందం విద్యుత్ సంస్థల సామర్థ్యాన్ని దెబ్బతీసిందని వ్యాఖ్య

ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీలో విద్యుత్ రంగం కకావికలమయిందని రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ...  2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం 23 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలను రద్దు చేసిందని ఆయన అన్నారు. వాటి ఉత్పత్తి సామర్థ్యం 2,132 మెగావాట్లు అని తెలిపారు. అదే ప్రభుత్వం 2021 డిసెంబర్ లో సెకి ద్వారా ఒక సంస్థకు చెందిన 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. 

ఈ రెండు సందర్భాల్లో తమ బాస్ అయిన ముఖ్యనేతకు భారీ లబ్ధి చేకూర్చడంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలకపాత్రను పోషించారని పీవీ రమేశ్ తెలిపారు. ఈ ఒప్పందం విద్యుత్ సంస్థల సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పారు. ఈ ఒప్పందం కారణంగా వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్ ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. ఈ ఒప్పందంపై సమగ్ర విచారణ జరపాలని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News