Kiran Abbavaram: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే!

This week OTT movies and series

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'క' సినిమా 
  • ఈ నెల 28 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ 
  • అదే రోజున 'జీ 5' నుంచి పలకరించనున్న 'వికటకవి' సిరీస్
  • ఈ నెల 29 నుంచి హాట్ స్టార్ లో 'పారాచూట్' సిరీస్  


ప్రతివారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై గట్టిపోటీ కనిపిస్తోంది. ఎవరికి వారు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అందించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. సాదాసీదా అంశాలతో రూపొందిన కంటెంట్ ను కాకుండా, కొత్త పాయింటును టచ్ చేసిన కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అలాంటి కంటెంట్ కలిగిన జాబితాలో 'క' సినిమా, 'వికటకవి' .. ' పారాచూట్' సిరీస్ లు కనిపిస్తున్నాయి. 

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన 'క' సినిమా, థియేటర్స్ వైపు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. ఆయన ఇంతవరకూ చేసిన సినిమాలలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సస్పెన్స్ థ్రిల్లర్, ఈ నెల 28వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అందువలన ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా మరింత రెస్పాన్స్ ను రాబట్టుకునే ఛాన్స్ ఉంది. ఇక నరేశ్ అగశ్య ప్రధానమైన పాత్రను పోషించిన 'వికటకవి' సిరీస్ పట్ల చాలామంది ఆసక్తిని చూపుతున్నారు. టైటిల్ తోను .. పోస్టర్స్ తోను అంచనాలు పెంచిన సిరీస్ ఇది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్ కి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా కనిపించే ఈ సిరీస్, ఈ నెల్ 28 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఫస్టు డిటెక్టివ్ సిరీస్ కావడమనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక తమిళంలో రూపొందిన 'పారాచూట్' సిరీస్, ఈ నెల 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ నటుడు కృష్ణ కులశేఖరన్ ఈ సిరీస్ కి నిర్మాత. రాసు రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ట్రైలర్ తో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రి కొడతాడనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు చిన్నారుల చుట్టూ తిరిగే కథ ఇది. తెలుగు ప్రేక్షకుల వరకూ తీసుకుంటే, 'క' సినిమాతో పాటు, ఈ రెండు సిరీస్ లు వారిలో కుతూహలాన్ని రేకెత్తిస్తున్నవే.

Kiran Abbavaram
Naresh Agasthya
Kishore
Ka Movie
Vikatakavi
  • Loading...

More Telugu News