Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లిపై వార్తలు.. ముస్లింను మాత్రం పెళ్లాడవద్దంటూ నెటిజన్ సలహా

Dont Marry Muslim Boy Advice To Sania Mirza From Fan

  • షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న సానియా
  • కొత్త జీవితంపై సానియా పోస్ట్
  • ఆమె కొత్త జీవితం ప్రారంభించాలంటూనే ఆశ్చర్యకరమైన సలహా ఇచ్చిన అభిమాని
  • షమీతో పెళ్లి వార్తలను ఊహాగానాలుగా కొట్టేసిన సానియా తండ్రి

పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత సానియా మీర్జా తన కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఆమెతో విడాకుల తర్వాత పాక్ నటి సానా జావేద్‌ను షోయబ్ పెళ్లాడాడు. దీంతో సానియా రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. విడాకుల తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్న సానియా ప్రస్తుతం ఒంటరి తల్లిగా కుమారుడి బరువుబాధ్యతలు చూసుకుంటున్నారు. 

ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి అనూహ్యమైన సలహా వచ్చింది. ‘కొత్త జీవితం ప్రారంభించాలి’ అన్న సానియా పోస్టుకు ఓ అభిమాని స్పందిస్తూ.. ‘సానియా కొత్త జీవితం ప్రారంభించాలి, కానీ ముస్లిం అబ్బాయిని మాత్రం పెళ్లాడొద్దు’ అని సలహా ఇచ్చాడు. అతడి సలహాకు మిశ్రమ స్పందన లభించింది.

షమీతో రెండో పెళ్లిపై రూమర్లు
సానియా మీర్జా, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. వీటిని సానియా తండ్రి ఖండించారు. వాటిని నిరాధార వార్తలుగా కొట్టిపడేశారు. కాగా, షమీ కూడా భార్య హసీన్ జహాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు. 

Sania Mirza
Sania Mirza Second Marriage
Shoaib Malik
Mohammad Shami
  • Loading...

More Telugu News