divvela madhuri: పోలీసులకు ఫిర్యాదు చేసిన దివ్వెల మాధురి

alliance government should prove honesty divvela madhuri
  • అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన దివ్వెల మాధురి
  • చంద్రబాబు, పవన్, అనిత మాటలపై నమ్మకంతోనే ఫిర్యాదు చేసినట్లు మాధురి వెల్లడి
  • కూటమి ప్రభుత్వ నిజాయతీని నిరూపించుకోవాలన్న మాధురి
వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వీరు మారుమోగుతున్నారు. మరో పక్క రెండేళ్ల క్రితం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ నేపథ్యంలో తాజాగా తమపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం వైసీపీ కార్యకర్తలతో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్‌లో సీఐకి వీడియోలతో కూడిన ఆధారాలతో ఫిర్యాదు సమర్పించారు.  

ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ .. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల పోస్టులు పెట్టే ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. 

వారి మాటలపై నమ్మకంతోనే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, తనపై, వైసీపీ కార్యకర్తలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తుందని ఇచ్చిన హామీని నిరూపించుకోవాలని ఆమె కోరారు. 
divvela madhuri
Tekkali
Duvvada Srinivas
YSRCP
Janasena

More Telugu News