Kissik: పుష్ప-2 నుంచి 'కిస్సిక్' సాంగ్ రిలీజ్... ట్రెండింగ్ లో నెంబర్ వన్

Kissik song from Pushpa 2 out now

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2 ది రూల్
  • డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్
  • ఇవాళ అదిరిపోయే ఐటమ్ సాంగ్ కిస్సిక్ విడుదల

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 ది రూల్ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే ఐటమ్ సాంగ్ కిస్సిక్ రిలీజైంది. పుష్ప ఫస్ట్ పార్ట్ లో సమంత నటించిన ఊ అంటావా మామా ఊఊ అంటావా మామా పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2లో ఈ 'కిస్సిక్' అనే ఐటమ్ సాంగ్ ను యువ హీరోయిన్ శ్రీలీలపై చిత్రీకరించారు. 

ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. సుభ్లాషిణి ఆలపించారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లో 4 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో నెంబర్ వన్ పొజిషన్ కు చేరింది.  

కాగా, పుష్ప-2 చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇవాళ చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న, నిర్మాతలు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తదితరులు హాజరు కాగా... ఎప్పట్లాగానే దర్శకుడు సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

Kissik
Pushpa-2
Allu Arjun
Sukumar
Rashmika Mandanna
Devi Sri Prasad
Chandrabose
Sublashini
Mythri Movie Makers
Tollywood

More Telugu News