IPL Mega Auction: ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం... అర్షదీప్ కు కళ్లు చెదిరే ధర

IPL Mega Auction has began

  • వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఐపీఎల్ 18వ సీజన్
  • నేడు, రేపు సౌదీ అరేబియాలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ
  • లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 577 మంది ఆటగాళ్లతో ఈ వేలం నిర్వహించనున్నారు. 204 స్లాట్స్ కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. 

ఆక్షనీర్ మల్లికా సాగర్... ఫ్రాంచైజీలకు గుడ్ లక్ చెప్పి వేలం ప్రారంభించారు. మొదట పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్ పేరుతో వేలం షురూ అయింది. ఈ లెఫ్టార్మ్ సీమర్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. అర్షదీప్ సింగ్ కనీస ధర రూ.2 కోట్లు కాగా... సన్ రైజర్స్ అతడిని దక్కించుకునేందుకు హోరాహోరీ పోరాడింది. రూ.18.75 కోట్ల వరకు సన్ రైజర్స్ వేలంలో నిలిచింది. 

అయితే, పంజాబ్ కింగ్స్ 'రైట్ టు మ్యాచ్' కార్డు ఉపయోగించి రూ.18 కోట్లతో అర్షదీప్ ను సొంతం చేసుకుంది. 

అసలేమిటీ రైట్ టు మ్యాచ్ కార్డు...?

ఐపీఎల్ నిబంధనల ప్రకారం తాము విడుదల చేసిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ఈ రైట్ టు  మ్యాచ్ కార్డు సాయంతో వేలంలో మళ్లీ సొంతం చేసుకోవచ్చు. తాము రిలీజ్ చేసిన ఆటగాడు వేలంలోకి వచ్చినప్పుడు...ఇతర ఫ్రాంచైజీలు పోటీపడుతున్నప్పటికీ... అతడ్ని రిలీజ్ చేసిన ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగిస్తే ఇతర ఫ్రాంచైజీలకు ఇక ఎలాంటి అవకాశం ఉండదు. సదరు ఆటగాడు తన పాత ఫ్రాంచైజీకే సొంతం అవుతాడు. ఇటీవలే అర్షదీప్ సింగ్ ను రిలీజ్ చేసిన పంజాబ్ కింగ్స్... ఇవాళ అతడ్ని ఈ విధంగానే సొంతం చేసుకుంది. 

IPL Mega Auction
Jeddah
Saudi Arabia
  • Loading...

More Telugu News