Rohit Sharma: పెర్త్ చేరుకున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌... ఇదిగో వీడియో!

CAPTAIN ROHIT SHARMA IS HERE IN PERTH

  • ఇటీవ‌ల పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన‌ రోహిత్ భార్య
  • దాంతో స్వదేశంలోనే ఉండిపోయిన హిట్‌మ్యాన్‌
  • తాజాగా పెర్త్ చేరుకున్న వైనం

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పెర్త్ చేరుకున్నాడు. విమానాశ్ర‌యం నుంచి రోహిత్ బ‌య‌ట‌కు వ‌చ్చి కారు ఎక్కిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కాగా, ఇటీవ‌ల అత‌ని భార్య కుమారుడికి జ‌న్మ‌నివ్వ‌డంతో స్వ‌దేశంలోనే ఉండిపోయిన విష‌యం తెలిసిందే. జ‌ట్టుతో క‌లిసి ఆస్ట్రేలియా వెళ్ల‌లేక‌పోయిన హిట్‌మ్యాన్ ఇవాళ టీమిండియాతో క‌ల‌వ‌నున్నాడు. రెండో టెస్టు నుంచి రోహిత్ జ‌ట్టులోకి చేర‌తాడు. 

మ‌రోవైపు బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో జ‌స్ప్రీత్ బుమ్రా సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు మ్యాచ్‌పై ప‌ట్టు బిగించింది. ఏకంగా 500 ర‌న్స్ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ భారీ శ‌త‌కానికి (161) తోడు విరాట్ కోహ్లీ అజేయ శ‌త‌కం (100), మ‌రో ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీ (77) భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించ‌డంలో స‌హ‌క‌రించాయి. 

Rohit Sharma
Team India
Cricket
Perth
Sports News

More Telugu News