Ambati Rambabu: కూటమి సర్కార్‌పై వైసీపీ మాజీ మంత్రి అంబటి ఫైర్ ..

ambati rambabu question to ap police

  • వైసీపీ నేతలపై అసత్య పోస్టులు పెడుతున్నారన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు
  • పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదన్న అంబటి
  • న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించిన అంబటి

ఏపీలో కూటమి సర్కార్ పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతున్నారని అంబటి ఆరోపించారు. తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయన ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్‌తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐటీడీపీ అనే పేరుతో అసభ్య పోస్టులు పెడుతున్నారన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి మూడు రోజుల పాటు అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ వైసీపీ క్యాడర్ పై మాత్రం 300 కేసులు నమోదు చేశారని చెప్పారు. 

టీడీపీ నాయకుల చెప్పుచేతల్లో పోలీస్ వ్యవస్థ పని చేస్తున్నట్లు కనబడుతోందని మండిపడ్డారు. ఇలానే పోలీసులు వ్యవహరిస్తే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.   

Ambati Rambabu
YSRCP
TDP
Social Media
  • Loading...

More Telugu News