viral video: నడుస్తున్న రైలుపై అమ్మాయి పరుగు.. వైరల్‌ వీడియో ఇదిగో!

Girl running on a moving train Here is the viral video

  • రైలు ముందుకు కదులుతుంటే వెనుకవైపు పరుగు పెట్టిన యువతి
  • తర్వాత ఆగిపోయి కేరింతలతో కాసేపు డ్యాన్స్‌
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

అక్కడా ఇక్కడా పరుగెత్తడం మామూలే. కానీ నడుస్తున్న రైలుపై పరుగెడితే... కాస్త పట్టు తప్పినా పెద్ద ప్రమాదం తప్పదు. కానీ ఒక యువతి నడుస్తున్న రైలుపై వెనక్కి పరుగెత్తింది. కాసేపు అలా పరుగెత్తి... ఆగిపోయింది. ఈసారి కేరింతలు కొడుతూ డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఆ వీడియో ఎక్కడ తీసినది, ఆ అమ్మాయి ఎవరన్న వివరాలపై మాత్రం స్పష్టత లేదు. కేవలం బంగ్లాదేశ్‌ లో తీసిన వీడియో అన్న అంశం మాత్రమే ఉంది.
  • అది డీజిల్‌ ఇంజన్లతో కూడిన రైలు. అంటే పైన విద్యుత్‌ తీగలు వంటివేవీ ఉండవు. కాబట్టి రైలుపై నిలబడటం పెద్ద సమస్యేమీ కాదు. కానీ రైలు కదులుతున్న సమయంలో దానిపై పరుగెత్తడం, డ్యాన్స్‌ చేయడం మాత్రం రిస్కే.
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన ఈ వీడియోకు కొన్ని గంటల్లోనే మూడున్నర లక్షల వ్యూస్‌, వేల కొద్దీ లైకులు వచ్చాయి.
  • అమ్మాయికి ధైర్యం బాగానే ఉందని కొందరు కామెంట్‌ చేస్తుంటే... షారూఖ్‌ ఖాన్‌ ‘దిల్‌’ సినిమాలోని ఫేమస్‌ పాట ‘ఛల్‌ ఛయ్య ఛయ్య ఛయ్యా...’ ను చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు.

viral video
Girl
Dance
Train
X Corp
Twitter
offbeat

More Telugu News