IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలానికి ఆంధ్రా కుర్రాడు

Andhra Pradesh Cricket Player in IPL 2025 Auction List

  • ఇవాళ‌, రేపు ఆటగాళ్ల మెగా వేలం
  • సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం ప్రక్రియ
  • మెగా ఆక్షన్‌కు తిరుప‌తి జిల్లా కుర్రాడు య‌ద్దెల గిరీశ్ కుమార్ రెడ్డి

మ‌రికొన్ని గంట‌ల్లో ఐపీఎల్ మెగా వేలానికి తెర‌లేవ‌నుంది. ఈరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు సౌదీ అరేబియాలోని జెడ్డా న‌గ‌రం వేదికగా ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ‌, రేపు రెండు రోజుల పాటు ఈ వేలం జ‌ర‌గ‌నుంది. ఈసారి వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 204 స్లాట్స్ కోసం వీరు వేలంలో పోటీ పడనున్నారు. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు కాగా, 210 మంది విదేశీ క్రికెటర్లు.  

అయితే, ఈసారి ఈ వేలం పాట‌లో ఏపీలోని తిరుప‌తి జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు కూడా న‌మోద‌య్యాడు. జిల్లాలోని రామ‌చంద్ర‌పురం మండ‌లం అనుప‌ల్లి పంచాయ‌తీ నూతిగుంట‌ప‌ల్లికి చెందిన య‌ద్దెల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, హేమ‌ల‌త దంప‌తుల కుమారుడు య‌ద్దెల గిరీశ్ కుమార్ రెడ్డి (25) ఐపీఎల్ వేలానికి వెళ్తున్నాడు. త‌ద్వారా వేలానికి వెళ్తున్న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా క్రికెట‌ర్‌గా నిలిచాడు. 

ఎస్‌వీయూలో బీటెక్ పూర్తి చేసిన గిరీశ్ కుమార్ రెడ్డి గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రీమియ‌ర్ లీగ్‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బరిచి 10 మ్యాచుల్లోనే 18 వికెట్లు తీశాడు. వ‌న్డేలు, టీ20ల్లో ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో ఇప్పుడు ఐపీఎల్ మెగా వేలానికి షార్ట్‌లిస్ట్ అయ్యాడు.

IPL 2025 Auction
Andhra Pradesh
Tirupati
Cricket
Sports News
  • Loading...

More Telugu News