Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురి మృతి

Seven killed in fatal accident in Ananatapur district

  • ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • ఇద్దరు ఘటన స్థలంలోనే దుర్మరణం
  • మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

వ్యవసాయ కూలీలు పొలం పనులు ముగించుకుని ఆటోలో ఇళ్లకు వెళుతుండగా... ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటన స్థలంలో ఇద్దరు దుర్మరణం చెందగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

కాగా, మృతులను తాతయ్య (55), రామాంజనమ్మ (48), చిన నాగమ్మ (48), పెద నాగమ్మ (60), జయరాముడు, చిన నాగన్న, కొండమ్మగా గుర్తించారు. మృతులంతా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందినవారు. 

ఒకేసారి ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎల్లుట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Road Accident
Auto
RTC Bus
Anantapur District
  • Loading...

More Telugu News