Osmania University: ఓయూ సంచలన నిర్ణయం... హిందీ మహా విద్యాలయ అనుమతులు రద్దు

OU cancels Hindi Mahavidyalaya

  • స్వయంప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీకి సిఫార్సు
  • ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం
  • మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో నిర్ణయం

ఉస్మానియా యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నల్లకుంటలోని హిందీ మహా విద్యాలయం అనుమతులను రద్దు చేసింది. ఈ మేరకు హిందీ మహా విద్యాలయం స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీకి సిఫార్సు చేసింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు కోర్సు పూర్తి చేసేందుకు ఉస్మానియా యూనివర్సిటీ అవకాశం కల్పించింది.

విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు ఓయూ విచారణ కమిటీ తేల్చడంతో ఓయూ ఈ నిర్ణయం తీసుకుంది. ఓ ప్రైవేటు కాలేజీలో ఓయూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు కూడా విచారణ కమిటీ నిర్ధరించింది. ఈ క్రమంలో ఓయూ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Osmania University
Hindi Mahavidyalaya
Hyderabad
  • Loading...

More Telugu News