: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం


రాష్ట్ర అసెంబ్లీ చివరి దఫా బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం విపక్షాల దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతుండగా.. సర్కారును ఇరుకునపెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు తాము ప్రజల సమస్యలపై పోరాడతామని ఈసరికే టీడీపీ స్పష్టీకరించింది. అవినీతి మంత్రుల వ్యవహారం, విద్యుత్ సంక్షోభం, విత్తనాల కొరత, ఏపీపీఎస్సీలో అక్రమాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ వెల్లడించారు.

మరోవైపు, చలో అసెంబ్లీ పేరిట తెలంగాణ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తోన్న ఆందోళన కార్యక్రమానికి తాము అనుమతివ్వలేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. అసెంబ్లీకి కిలోమీటర్ పరిధిలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని శర్మ చెప్పారు.

  • Loading...

More Telugu News