Kiran Abbavaram: ఓటీటీ తెరపైకి హిట్ మూవీ... 'క'

Ka Movie OTT Release Date Confirmed

  • కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'క'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • థియేటర్స్ కి భారీ వసూళ్లు రాబట్టిన కంటెంట్  
  • ఈ నెల 28వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్   


కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'క' సినిమా, అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, థియేటర్ల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను నమోదు చేసింది. కిరణ్ అబ్బవరం ఇంతవరకూ చేసిన సినిమాలలో అత్యధిక వసూళ్లను సాధించినదిగా నిలిచింది. 

అలాంటి ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఈటీవీ విన్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కిరణ్ అబ్బవరం జోడిగా నయన్ సారిక నటించిన ఈ సినిమాకి, సందీప్ - సుజిత్ దర్శకత్వం వహించారు. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. 

కథ విషయానికి వస్తే... వాసుదేవ్ ఒక అనాథ. ఒక రోజున అనాథ శరణాలయం నుంచి అతను పారిపోతాడు. ఇతరులు రాసిన ఉత్తరాలు చదవడం అతనికి ఇష్టం. కృష్ణగిరిలో అతను పోస్టుమేన్ గా జాబ్ సంపాదిస్తాడు. అక్కడే సత్యభామతో ప్రేమలో పడతాడు. ఆ ఊళ్లో ఒక్కో అమ్మాయి అదృశ్యమవుతూ ఉంటుంది. అందుకు కారణం ఏమిటి? అది తెలుసుకున్న వాసుదేవ్ ఏం చేస్తాడు? అనేది కథ. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

Kiran Abbavaram
Nayan Sarika
Thanvi Ram
ka Movie
  • Loading...

More Telugu News