Eknath Shinde: ప్రభుత్వం అంటే ఫేస్ బుక్ కాదు: థాకరేపై షిండే విమర్శలు

Government means not Facebook says Eknath Shinde

  • మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం
  • మిఠాయిలు పంచుకున్న షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్
  • ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోమన్న షిండే

మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ముగ్గురు నేతలు మిఠాయిలు పంచుకున్నారు. 

ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ ఉద్ధవ్ థాకరేపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అంటే ఫేస్ బుక్ కాదని చెప్పారు. నాయకుడు అనేవాడు ప్రజల మధ్య పని చేయాలని బాలాసాహెబ్ థాకరే చెప్పేవారని... ఆయన చెప్పినదాన్ని తాము పాటిస్తూ వచ్చామన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలిపారు. 

లోక్ సభ ఎన్నికల సమయంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేశారని షిండే మండిపడ్డారు. వారి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని... అందుకే తమకు ఘన విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ముందుకు సాగుతామని అన్నారు.  

  • Loading...

More Telugu News