Kishan Reddy: సంజయ్ రౌత్ అనే పనికిమాలిన నేత అక్కడున్నారు: కిషన్ రెడ్డి

Kishan Reddy fires on Sanjay Raut

  • మహారాష్ట్రలో ఘన విజయం దిశగా ఎన్డీయే
  • ఎన్డీయే గెలుపుకు ఈవీఎంలే కారణమన్న సంజయ్ రౌత్
  • ఓటమిని ఈవీఎంలపై నెట్టివేయడం ఆయనకు అలవాటేనన్న కిషన్ రెడ్డి

మహారాష్ట్రలో ఎన్డీయే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతానికి 288 సీట్లకు గాను 230 స్థానాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యతలో ఉంది. ఈ ఫలితాలతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈ ఫలితాల సరళిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమయిందని అన్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కలిసి కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

శివసేన నేత సంజయ్ రౌత్ పై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సంజయ్ రౌత్ అనే పనికిమాలిన నేత మహారాష్ట్రలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఈవీఎంలే కారణమని సంజయ్ రౌత్ అంటున్నారని... ప్రతి ఓటమిని ఈవీఎంలపైకి నెట్టివేయడం ఆయనకు అలవాటని అన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని... ఆయన నాయకత్వంలో భారత్ పురోగమిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీయే పార్టీలన్నింటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 

బీజేపీ గెలుపుకు ఈవీఎంలే కాణమని కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. జమ్మూకశ్మీర్, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. కులం, మతం పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదని అన్నారు.

Kishan Reddy
BJP
Sanjay Raut
Shiv Sena
  • Loading...

More Telugu News