Chandrababu: అమిత్ షాకు చంద్రబాబు ఫోన్

AP CM Chandrababu Phone Call To Union Minister Amit Shah
  • మహారాష్ట్ర ఫలితాలపై అభినందనలు
  • అపూర్వ విజయమంటూ వ్యాఖ్యలు
  • మహాయుతి నేతలకూ ఫోన్ చేసిన ఏపీ సీఎం
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సంచలన విజయం వైపు దూసుకెళుతుండడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అన్నారు. 

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకూ చంద్రబాబు ఫోన్ చేశారు. మహాయుతి కూటమికి అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రస్తుతం 224 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ కూటమి కేవలం 55 స్థానాల్లోనే ముందంజలో ఉంది.
Chandrababu
Amit Shah
Maharashtra Results
Babu Phone call
Eknath Shinde
Devendra Fadnavis

More Telugu News