Mahesh Babu: సన్ టెక్ ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు

Mahesh Babu to promote Truzon Solar

  • ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న మహేశ్ బాబు
  • ట్రూజన్ సోలార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్న మహేశ్
  • యాడ్ కు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పలు కంపెనీల ప్రాడక్ట్ లను ఆయన ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఆయన మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త బ్రాండ్ అయిన ట్రూజన్ సోలార్ కు ఆయన ప్రచారం చేయనున్నారు. 

ట్రూజన్ సోలార్ తొలి యాడ్ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ యాడ్ రిలీజ్ కానుంది. మరోవైపు మహేశ్ బాబు మాట్లాడుతూ... ట్రూజన్ సోలార్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

Mahesh Babu
Suntek
Tollywood
  • Loading...

More Telugu News