sony tv: భారీ మొత్తానికి ఆసియా కప్ హక్కులు సొంతం చేసుకున్న సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్

sony tv bags asia cup medi rights for 8 years

  • ఆసియా కప్ మీడియా హక్కుల కోసం బిడ్డింగ్‌లో పోటీ పడిన జియో స్టార్, సోనీ నెట్ వర్క్
  • పోటీ నుండి తప్పుకున్న జియో 
  • రూ.14వేల కోట్ల కనీస ధరకు ఆసియా కప్ మీడియా హక్కులను దక్కించుకున్న సోనీ

సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా భారీ మొత్తంతో ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ మీడియా హక్కులను కైవసం చేసుకుంది. ఎనిమిదేళ్ల కాలానికి సోనీ టీవీ మీడియా హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) శుక్రవారం తెలిపింది. ఆసియా కప్ మీడియా హక్కుల కోసం దుబాయ్ లో గత వారం జరిగిన బిడ్డింగ్ ప్రక్రియలో జియో స్టార్, సోనీ నెట్ వర్క్ లు పోటీ పడ్డాయి.

చివరకు జియో స్టార్ పోటీ నుండి వైదొలిగింది. దీంతో సోనీ నెట్ వర్క్ మాత్రం బిడ్డింగ్ నిలిచి రూ.14 వేల కోట్ల కనీస ధరకు మీడియా హక్కులను హస్తగతం చేసుకుంది. 2024 నుంచి 2031 వరకూ సోనీ నెట్ వర్క్ ఆసియా కప్ ప్రసార మాధ్యమంగా వ్యవహరించనుంది. తాజా వేలం ద్వారా గతం కంటే 70 శాతం అదనపు ఆదాయం ఏసీసీకి సమకూరింది. 
 
సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా తమ మీడియా భాగస్వామిగా మారడంతో అభిమానులకు ప్రపంచ స్థాయి మ్యాచ్‌ల అనుభూతిని కలిగిస్తామనే నమ్మకం తమకు ఉందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. పురుషులు, మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లతో పాటు మహిళల అండర్ – 19 ఆసియా కప్ ప్రసార హక్కులను సోనీ టీవీకి కట్టబెట్టామని, ఈ ఒప్పందం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడింది. 

  • Loading...

More Telugu News