Rahul Gandhi: ఢిల్లీ వాయు కాలుష్యంపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi responds on Delhi Pollution

  • ఉత్తర భారతంలో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోందన్న రాహుల్ గాంధీ
  • పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి, పరిష్కారం కనుగొనాలని సూచన
  • రాజకీయ విమర్శలకు సమయం కాదన్న రాహుల్ గాంధీ

ఢిల్లీ వాయు కాలుష్యంపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఉత్తర భారతంలో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోందని, ఇది జాతీయ అత్యవసర పరిస్థితే అన్నారు. ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి ఆయన మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేశారు.

పార్లమెంట్ సమావేశాల్లో వాయు కాలుష్యంపై చర్చించి సరైన పరిష్కారం కనుగొనాలన్నారు. వాయు కాలుష్యానికి సామాన్యులే ఎక్కువగా బలవుతున్నారన్నారు. చిన్నారులు ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషపూరిత వాతావరణాన్ని శుభ్రం చేయాల్సిన అవశ్యకత ఉందన్నారు. 

కాలుష్య మేఘాలు వందలాది కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని, వాటిని తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ముప్పు ముంచుకొస్తున్నందున ఇది రాజకీయ విమర్శలకు సమయం కాదన్నారు. ప్రభుత్వంతో పాటు సంస్థలు, ప్రజలు, నిపుణులు అంతా కలిసి ముందడుగు వేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News